తెలంగాణలో ఒకవైపు లాక్‌డౌన్ కొనసాగుతుండగా మరోవైపు రైతులు ఆంధోళనలు చేస్తున్నారు. తెలంగాణలోని తుఫ్రాన్ మండలంలోని యానాపూర్ లో రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆంధోళనలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు నిరసనలు చేస్తున్నారు. పంటను రోడ్లపై పోసి తగలబెట్టారు. దీంతో గజ్వేల్-తుఫ్రాన్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లాక్ సడలింపుల సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని లేదంటే ఆంధోళనలు ఉదృతం చేస్తామని రైతులు చెబుతున్నారు.
మెదక్ జిల్లాలో రైతుల ఆంధోళన…భారీగా ట్రాఫిక్ జామ్
