NTV Telugu Site icon

Indrakaran Reddy: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసిన దిలావ‌ర్ పూర్ మండ‌ల రైతులు

Indrakaran Reddy

Indrakaran Reddy

Indrakaran Reddy: నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ గ్రామ రైతులు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని కలిసారు. మండల పరిసర ప్రాంతంలో జ‌నావాసాల్లో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును విర‌మించుకోవాలని కోవాలని కోరారు. జ‌నావాసాల‌కు దూరంగా ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పితే ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి స్ప‌ష్టం చేశారు. ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ‌ ఏర్పాటును వ్య‌తిరేకిస్తున్నామని అన్నారు. దిలావ‌ర్ పూర్ మండ‌ల రైతులు క్యాంప్ కార్యాయ‌లంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌క‌ణ్ రెడ్డిని క‌లిసి విన‌తిపత్రం అందించారు. పరిశ్రమ ఏర్పాటు వలన ప్రజల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. పంట పొలాల్లోకి వ్యర్థాలు చేరుతాయని రైతులు ఆందోళన వ్య‌క్తం చేశారు. రైతుల బాధలను విన్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు.

Read also; Mahesh Babu: సూర్యా భాయ్ ఒక డ్రగ్ లాంటోడు…

రైతులు, ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యేగా వారికి అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. జ‌నావాసాల్లో కాకుండా దూరంగా ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేస్తే మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించి, అనుమానాలను నివృత్తి చేసి అనువైన ప్రాంతంలో ఇథానాల్ పరిశ్రమను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అలా చేయనందు వల్లే రైతులు ఇక్కడ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారని మంత్రి తెలిపారు.
June Aviation Data: దేశీయ విమాన ట్రాఫిక్‌లో పెరుగుదల.. జూన్‌లో 1.24కోట్లకు పైగా ప్రయాణీకులు