Fake doctors: వైద్యో నారాయణో హరిః అంటారు. వైద్యులు దైవంతో సమానం. వారి చేతిలోనే బతకడం చావడం అంటూ ఉంటుంది. అయితే వారి దగ్గరకు ఏదైనా అనారోగ్యంతో వెళితే అది నయమై బయటకు వచ్చేంత వరకు డౌటే. ఎందుకంటే మన ప్రాణాలు ఆ డాక్టర్ల చేతిలోనే ఉంటాయి కాబట్టి. అంతా మంచిగా ఉండి బతికి బయటకు వచ్చామో.. అదృష్టం.. లేదంటే భూమి మీద నూకలు చెల్లినట్టే. ఇలాంటి ఘటనలే రోజుకో చోట వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది డాక్టర్లు పైసల కోసం పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ఇలాంటి దారుణాలు వెలుగులోకి రావడంతో వైద్యం కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్లాలంటే వణుకు పుడుతుంది. ఈ క్రమంలోనే నొప్పితో వెళ్ళిన మహిళ గర్భం, కిడ్నీలు మాయం చేసిన ఘటన సంచలనంగా మారింది. ఇది బీహార్ లో చోటుచేసుకుంది.
ముజఫర్‌పూర్‌లోని మధురాపూర్‌కు చెందిన సునీతాదేవి కడుపునొప్పి కారణంగా స్థానిక శుభకాంత్ క్లినిక్‌కి వెళ్లింది. కానీ తాను డాక్టర్ అని చెప్పుకోని పవన్ కుమార్ అనే కాంపౌండర్ క్లినిక్ నడుపుతున్నాడు. పవన్ కుమార్ తన భార్య జితేంద్ర కుమార్ పాశ్వాన్, ఆర్కే సింగ్‌తో కలిసి ఆ మహిళకు రెండున్నర గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ కోసం 20 వేలు వసూలు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సునీతాదేవి శరీరం నుంచి గర్భాశయం, 2 కిడ్నీలు తీసుకున్నారు. అవయవాలను దొంగిలించిన అనంతరం బాధితురాలి ఆరోగ్యం క్షీణించింది. ఆమెను పాట్నాలోని మరో ఆసుపత్రికి తరలించగా వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఆ ఆసుపత్రిలో మరో రూ.40 వేలు ఖర్చయ్యాయి.
అనంతరం సునీతాదేవిని పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేశారు. ఈ స్కానింగ్‌ని చూసి ఆస్పత్రి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే సునీతాదేవి రెండు కిడ్నీలు, గర్భాశయం వారికి కనిపించలేదు. షాక్ నుంచి తేరుకున్న వైద్యులు ఆమె రెండు కిడ్నీలు, గర్భాశయం చోరీకి గురైనట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సెప్టెంబర్ 2022 నుండి సునీతా దేవి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఆమె ప్రభుత్వ సహాయంతో డయాలసిస్ చేయించుకుంటుంది. ఈ ఘటనతో ఆమె వెంట ఉండాల్సిన భర్త దూరమయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కిడ్నీలు అపహరించిన దొంగలను అరెస్టు చేశారు. కానీ నిందితులు ఆ కిడ్నీలను విక్రయించలేదని తెలిపారు. వాటిని సరిగా దాచి ఉంచకపోవడంతో కుళ్లిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితురాలు సునీతాదేవి.. నిందితుడు పవన్ కుమార్ కిడ్నీని తనకు ఇప్పించి అతడి ప్రాణాలు కాపాడాలని కోరుతోంది.
Sun will be high: రాష్ట్రంలో ఎక్కువగా ఎండ తీవ్రత.. 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం