NTV Telugu Site icon

Hyderabad Crime: విషాదం.. కోడలు వేధింపులతో పురుగుల మందు తాగిన కుటుంబసభ్యులు..

Crime

Crime

Hyderabad Crime: కోడలు వేధింపులు తాళలేక కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ త్రి స్టార్ హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. హోటల్ లోని మూడవ అంతస్తులో 308 గదిలో ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్ఠలికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురిని 108 అనబులెన్స్ లో యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు ముగ్గురూ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చెందినవారుగా గుర్తించారు. తండ్రి నారాయణ (52) తల్లి పద్మావతి (47 ) కొడుకు సృజన్ (23) గా గుర్తించారు. ఇటీవలే ఫిబ్రవరి 14న తల్లిదండ్రులు.. కొడుకు సృజన్ ను ఘనంగా పెళ్లి చేశారు.

Read also: Festival Rush: హైదరాబాద్‌లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..

అయితే కొద్ది రోజులు బాగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు మొదలయ్యాయని సమాచారం. దీంతో కోడలు కావ్య కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని చెంచిపల్లి పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తపై 498 A కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు అందరు కోడలు కావ్వకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. ముగ్గురు కలిసి సికింద్రాబాద్ చేరుకుని తాజ్ త్రి స్టార్ హోటల్ లోని 308 రూమ్ లో బస చేశారు. వీరు ముగ్గురు కలిసి కోడలికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాట్లు తెలిపారు. అవమానం భరించలేమని జ్యూస్ లో మత్తుపదార్డం కలిపి ముగ్గురు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని హూటల్ యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనేవ వీరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కోడలు కావ్వ, భర్త సృజన్ పై పెట్టిన కేసుపై ఆరా తీస్తున్నారు.
Health Tips: మెంతి ఆకులు, గింజలు గొప్పతనం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Show comments