Site icon NTV Telugu

Fake Currency : హైదరాబాద్‌లో నకిలీ నోట్ల చలామణి.. ఇద్దరు యువకులు అరెస్ట్

Fake Currency

Fake Currency

Fake Currency : హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. మెహిదీపట్నం పోలీసులు ప్రత్యేక సమాచారం ఆధారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ.2 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం అయ్యాయి.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కి చెందిన అన్సారీ అఫ్తాబ్ అజీముద్దీన్‌ తన నానమ్మ ఇంటికి, హైదరాబాద్‌ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ స్థానికంగా ఉండే అదిల్ హుసేన్‌తో పరిచయం ఏర్పడి, నకిలీ నోట్ల వ్యాపారం కోసం ఇద్దరూ యత్నించారని పోలీసులు వెల్లడించారు.

Pappu Yadav: ప్రధాని పోస్ట్‌ను క్షణంలోనే తిరస్కరించారు.. రాహుల్‌గాంధీ‌ మేధావి అంటూ పప్పు యాదవ్ ప్రశంసలు

మహారాష్ట్రలోని తన పరిచయం ఆకాశ్ దొంగ నోట్లు తయారు చేస్తాడని అజీముద్దీన్ అదిల్‌కి చెప్పాడు. 30 వేల రూపాయల అసలైన నోట్లు ఇస్తే లక్ష రూపాయల నకిలీ కరెన్సీ ఇస్తాడని ఆశచూపాడు. భారీ కమీషన్ వస్తుందని ప్రలోభపెట్టడంతో ఇద్దరూ నకిలీ నోట్లను తెప్పించి నగరంలో చలామణి చేయాలని ప్రణాళిక రచించారు.

ఫస్ట్ లాన్సర్ శ్రీరామనగర్ వద్ద వీరు నకిలీ నోట్లతో ఉన్నారన్న సమాచారం మేరకు మెహిదీపట్నం పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నకిలీ కరెన్సీ తయారుచేసిన ఆకాశ్ కోసం గాలింపు ప్రారంభించారు.

Crocs : మీ పిల్లలకు క్రోక్స్ చెప్పులు వాడుతున్నారా ?

Exit mobile version