Fake Certificates: సర్టిఫికెట్ల కేసులో జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి నల్గొండ పోలీసుల సోదాలు నిర్వహించారు. పట్టణంలోని స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీలో తనిఖీలు చేశారు. పలు యూనివర్సిటీలకు సంబంధించిన పత్రాలు, మరికొన్ని సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకుడు ఖలీల్ ను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్సిటీలకు సంబంధించిన పత్రాలు, మరికొన్ని సర్టిఫికెట్లపై ఆరా తీస్తున్నారు. వారిపై వేటు వేసేందుకు సిద్దమవుతున్నారు.
Read also: Yogi Adityanath: ఎన్‌కౌంటర్లలో 166 మంది నేరస్తులను లేపేశాం..
నగరంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ అమాయకులను మోసాలు చేస్తున్న ముఠాను జులై 29- 2022న సైబరాబాద్ పోలీసులు గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. నగరంలో నకిలీ ధృవపత్రాలను తయారు చేస్తు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 యూనివర్సిటీ లకు సంబంధించిన ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేస్తూ మార్కెట్ లో కూరగాయలు అమ్మకాలు చేస్తున్నట్లు నకిలీ మార్క్స్ మెమోలను అమ్మేస్తున్నారు. ఈ ముఠా నుండి 100 మందికి పైగా ఫేక్ సర్టిఫికెట్స్ పొందారని తేలింది. నిందితుల నుంచి 70 ఫేక్ సర్టిఫికేట్స్, 4 ఫేక్ స్టాంప్స్, కంప్యూటర్‌లు, బ్యాంక్ కార్డ్స్ , ఆధార్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.