MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వారు దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వీరి రిమాండ్‌ను ఈ నెల 31 వరకు పొడిగించింది. మరోవైపు సీబీఐ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా గురువారం రాత్రి రిమాండ్‌ను ఆగస్టు 8 వరకు పొడిగించారు. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు.
Read also: Raghunandan Rao: వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి ?
కవితపై చార్జిషీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కవిత అని సీబీఐ పేర్కొంది. మద్యం వ్యాపారులకు అనుకూలంగా మద్యం పాలసీ తయారీ… అందుకు సౌత్ గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. రూ. 100 కోట్ల ముడుపులు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంలో కవిత సూత్రధారి అని సీబీఐ చెబుతోంది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లి, అరుణ్ పిళ్లై, అశోక్ కౌశిక్ పనిచేశారని సీబీఐ చెబుతోంది. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, వెనక శరత్‌రెడ్డి డబ్బులు సమకూర్చినట్లు సమాచారం. మద్యం వ్యాపారం పేరుతో వసూలు చేసిన సొమ్మును హవాలా ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సీబీఐ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను దర్యాప్తు సంస్థ ఏప్రిల్ 11న అరెస్టు చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఏప్రిల్ 15 నుంచి జుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు.కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. జూలై 1న ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలకు ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.
South Central Railway: తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే..