Site icon NTV Telugu

Telangana High Court: ఈటలకు ఊరట.. జమునా హేచరీస్‌ కేసు 16కు వాయిదా

Etala Rajender

Etala Rajender

జమునా హేచరీస్ భూముల విషయంలో ఈటెల రాజేందర్ ఊరట లభించింది. గతంలో.. జమునా హేచరీస్ స్వాధీనంలో ఉన్న భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16న జరుపుతామని తెలిపింది.అయితే.. ఈ పిటిషన్‌లో భూములను కేటాయించిన అసైనీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లయిన జమునా హేచరీస్‌, ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిలను ఆదేశించింది.

read also: Nokia 4210 4G: మార్కెట్లోకి నోకియా 8210 4జీ ఫీచర్ ఫోన్.. ధర ఎంతంటే?

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని సర్వే నం.130లో జమునా హేచరీస్‌ స్వాధీనంలో ఉన్న మూడెకరాల భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో రెండు వారాలపాటు (ఈ నెల 16న) పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో.. ఈ పిటిషన్‌లో భూములను కేటాయించిన అసైనీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లయిన జమునా హేచరీస్‌, ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిలను ఆదేశించింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారంటూ తహసీల్దార్‌ జారీచేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ జమునా హేచరీస్‌, దాని తరఫున నితిన్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై మంగళవారం జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌ విచారణ చేపట్టారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది హరేందర్‌ పరిషద్‌ తెలిపారు. కాగా.. వివాదాస్పద భూమిని పేదలకు కేటాయించామని, వారిని ప్రతివాదులుగా చేర్చకపోవడం సరికాదన్నారు.
Corona Updates : తెలంగాణలో వెయ్యిదాటిన కరోనా కేసులు.. ఫోర్త్‌ వేవ్‌ తప్పదా..

Exit mobile version