Exit Polls: పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం అయితే.. ఫలితాల కోసం 19 రోజుల పాటు ఎదురుచూడడం మరో ఆందోళన. ఈవీఎంలలో తీర్పు నమోదవడంతో ప్రజలు ఎటువైపు ఓటేశారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ టెన్షన్ నుంచి కొంత మందికి నేడు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. చివరి రౌండ్ పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మే 13తో రాష్ట్రంలో పోలింగ్ ముగిసినా.. సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించడం లేదు. రాజకీయ పార్టీలు, సర్వే సంస్థలు ఇవాల్టి (జూన్ 1) కోసం ఎదురు చూస్తున్నాయి.
Read also: BRS Candle Rally: నేడు బీఆర్‌ఎస్ క్యాండిల్ ర్యాలీ.. గన్ పార్క్ నుంచి సచివాలయం వరకు
రాష్ట్రంలోని 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్‌పైనే అందరి దృష్టి ఉంది. సాధారణంగా పోలింగ్ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. దీంతో సర్వే సంస్థల అభిప్రాయ సేకరణ విస్తృతంగా జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్‌కు ముందు, తర్వాత సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి అంచనాలు రూపొందిస్తారు. ఈసారి అందుకు భిన్నంగా సర్వే సంస్థలకు రెండు వారాలకు పైగా సమయం దొరికింది. పోలింగ్ అనంతరం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు విస్తృత సర్వే నిర్వహించారు. ఇందుకోసం చాలా సంస్థలు సర్వేను చాలా కాలంగా కొనసాగించాయి. కాబట్టి ఈసారి ఫలితాలు మరింత పక్కాగా ఉంటాయని భావిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల తర్వాత చల్లబడ్డ రాజకీయ వాతావరణం ఎగ్జిట్ పోల్స్ తో మళ్లీ వేడెక్కనుంది.
Counting Process: ఓట్ల లెక్కింపు.. జీహెచ్‌ఎంసీ పకడ్బందీ ఏర్పాట్లు..