NTV Telugu Site icon

Drug Sales: హైదరాబాదులో డ్రగ్స్ విక్రయాలు.. అదుపులో నైజీరియన్..

Hyderabad Drugs

Hyderabad Drugs

Drug Sales: హైదరాబాదులో డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా డ్రగ్స్ మాఫియా ఆగడాలు పెరుగుతున్నాయి. తాజాగా డ్రగ్స్ మరో డ్రగ్స్ మాఫియాను గుట్టు రట్టు చేశారు పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న మరో నైజీరియన్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. బిజినెస్ వీసాపై ఇండియాకి వచ్చిన ఒకారో కాస్మోస్ రాంసి అలియాస్ ఆండి అనే నైజీరియాకు చెందిన వ్యక్తి హైదరాబాదులో డ్రగ్స్ అమ్మకాలపై దృష్టి పెట్టాడు. ఒకారో 2014లో న్యూఢిల్లీకి వచ్చిన అక్కడి నుండి హైదరాబాద్ కు వచ్చాడు. బట్టల ఎగుమతి పేరుతో దేశంలో పలు ప్రాంతాలలో తిరిగాడు.

Read also: Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ.. అందులో ఏముందంటే..!

అయితే డ్రగ్స్ ను ఎక్కడెక్కడ అమ్మగలం అనేది ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. ఏమీ తెలియనట్లు యువతకు ట్రాప్ చేసి వారికి డ్రగ్స్ అమ్మే పనిలో పడ్డాడు. 2016లో గోల్కొండ పోలీసులు ఇతనితో పాటు మరో నైజీరియన్ ను డ్రగ్స్ విక్రయిస్తుండగా అరెస్టు గుర్తించిన పోలీసులు ఇతన్ని అదుపులో తీసుకున్నారు. బెయిల్ పై విడుదలైన తర్వాత బెంగళూరుకు చెందిన ఒబాసి అనే నైజీరియన్ నుండి కొకైన్ డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్ లో పెడ్లర్ గా మారాడు. 2018లో గోల్కొండ ఎక్సైజ్ పోలీసులు కోకైన్ సరఫరా చేస్తుండగా స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. చాకచక్యంగా పెడ్లర్ ను అరెస్టు చేశారు. కస్టమర్లకు టెలిగ్రామ్ ద్వారా డ్రస్సులు సరఫరా చేస్తున్నాడని గుర్తించారు. ఒకారో కాస్మోస్ రాంసీ నుండి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపతి అనే మరో డ్రగ్ పెడ్లర్ అరెస్టు చేశారు. ఇతని దగ్గరి నుండి 43 ఎల్ఎస్‌డి బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.

Read also: నైట్ షిఫ్ట్ చేస్తున్నారా..? సంతాన‌ సమస్యలు ఖాయం

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు మరోసారి రట్టు చేశారు. ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లోని లాలాగూడలో విక్రయిస్తున్న కుష్, ఓజీ డ్రగ్స్‌ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కుష్, ఓజీ మందు ఆఫ్రికా, అమెరికాలో విరివిగా లభిస్తుందని.. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ మందు వల్ల కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తాయని వెల్లడించారు. వీరిని డ్రగ్స్‌తో పట్టుకుని విచారిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
BIG BREAKING: సోనియా తెలంగాణ పర్యటన రద్దు..?

Show comments