NTV Telugu Site icon

Ex MP Ravindra Naik: కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

Ex Mp Ravindra Naik

Ex Mp Ravindra Naik

Ex MP Ravindra Naik: తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఈరోజు బీజేపీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రవీంద్రనాయక్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్‌కు సీఎం కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2004లో వరంగల్ ఎంపీగా పనిచేసిన రవీంద్రనాయక్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి 2019లో బీజేపీలో చేరి.. గత నెలలో బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. బంజారా కమిషన్ ఏర్పాటులో బీజేపీ అధిష్టానం నిర్లక్ష్యం వహిస్తోందని, తాను బీజేపీలో సీనియర్ లంబాడీ నేతగా ఉన్నా.. బీజేపీ నేతలు ఏ విషయంలోనూ తనను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

Read also: Bhatti Vikramarka: రుణమాఫీ వంద రోజుల్లో చేస్తాం అనలేదు.. కానీ కట్టుబడి ఉన్నాం..!

అలాగే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. ఈ సమావేశంలో తాను పార్టీలో చేరేందుకు సిద్ధమని రేవంత్‌కి చెప్పినట్లు తెలిసింది. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన అధికారికంగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదిలావుంటే, గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్న కేసీఆర్ తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి షాక్ ఇచ్చారు. మరి ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.
Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్‌లో బిజెపి, టిఎంసి పరస్పర దాడులు