Ex Mp Ponguleti: కేసులు పెట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్బంగా టీఆర్ఎస్ వర్గీయుల మధ్య వివాదం చినికిచినికి గాలి వానలాగా మారుతోంది. పోలీసు అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అశ్వాపురం మండలం మల్లెల మడుగులో పొంగులేటి అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుపకుండా గ్రామంలో 144 సెక్షన్ విదించారు. ఈ సందర్బంగా పోలీసులతో ,రేగా వర్గీయులతో పొంగులేటి వర్గానికి మద్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడిలో పొంగులేటి వర్గీయులు గాయపడ్డారు. అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటుగా మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర రావు, మాజీ ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ల మీద అశ్వాపురం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల పై మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోలీసులపై ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ పద్దతుల్లో వ్యవహరించకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటున్నారు. తాను టీఆర్ఎస్ లోనే ఉన్నానని, తనపై కేసులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్న వారు ఆలోచించుకోవాలని అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఎవ్వరైనా చేయవచ్చునని అన్నారు. ప్రధానంగా తనమీద, తన అనుచరులుగా ఉన్నవారి మీద కేసులు పెడుతున్నారని ఆ కేసులను ఎదుర్కోవడం తమకేమి కొత్తకాదని అన్నారు. పోలీసు అధికారులు చట్టపరంగా వ్యవహరించాలి కాని, వ్యక్తి గత కక్ష్యలతో, కొంతమంది ప్రజా ప్రతినిధుల వత్తిడికి లొంగిపోవడం సరికాదని, వారిపై చట్ట రీత్యానే తాము పోరాటం సాగిస్తామని పొంగులేటి అంటున్నారు.
Also Read
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
- Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..