Site icon NTV Telugu

Konda Vishweshwar Reddy: బండితో కొండా భేటీ.. బీజేపీలో చేరతారా?

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ని విశ్వేశ్వరరెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఈ సమయంలో కొండా… సంజయ్‌ని కలవడంతో.. పార్టీలో చేరికపైనే అనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ బీజేపీ నేతలతో పలు సందర్భాల్లో సమావేశం అయ్యారు కొండా విశ్వేశ్వరరెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. మళ్లీ హస్తం పార్టీలో చేరతారనే ప్రచారం జరిగినా.. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే.. ఏదో జరుగుతోంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Minister Harish Rao: రాహుల్ ఎందుకొస్తున్నావ్.. ఏం చెప్పడానికి..?

కాగా, ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా గురువారం రోజు మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఏర్పాటు చేయ‌నున్న స‌మావేశానికి జేపీ న‌డ్డా హాజ‌రు కాబోతున్నారు.. ఆయన ప‌ర్యట‌న‌కు ముందు ఇలా బీజేపీ కీల‌క నేత‌ల‌తో కొండా విశ్వేశ్వర‌రెడ్డి భేటీ కావడంతో.. కొండా బీజేపీలో చేరతారా? జేపీ నడ్డా సమక్షంలోనే బీజేపీ కండువా కప్పుకుంటారా? అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. చూడాలి మరి.. రాజకీయాల్లో ఎప్పుడు.. ఏదైనా జరగొచ్చు.. మరి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎటువైపు అడుగులు వేస్తారో వేచిచూడాలి.

Exit mobile version