NTV Telugu Site icon

Konda Vishweshwar Reddy: మా అబ్బాయి పెళ్ళికి రండి.. మోడీకి ఇన్విటేషన్

Konda1

Konda1

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) ని కలిశారు. తన రెండో కొడుకు విశ్వజిత్ పెళ్లికి ఆహ్వానించడానికి ప్రధాన మంత్రి మోదీ కలిశామన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తనను ప్రధాని మోడీ ఎంతో ఆప్యాయంగా పలకరించారని ఆయన అన్నారు. తెలంగాణలో వైద్యం, విద్య, తదితర అంశాల మీద వారితో చర్చించడం ఎంతో గొప్ప అనుభూతినిచ్చింది. స్కూల్ టాయిలెట్స్ క్లీన్ చేసే మా స్వఛ్చ్ ట్రక్ ప్రాజెక్ట్ ఇంకా పెద్దమంగళారంలో ఉన్న మా బయో గ్యాస్ ప్రాజెక్ట్ ల గురించి ప్రధాన మంత్రికి వివరించామన్నారు. ఎంతో ఓపికతో విన్నారన్నారు. ఇంత సమయం ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రధాన మంత్రి మోదీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ప్రకటన విడుదల చేశారు చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

Read Also: Nidhi Agarwal: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం కడుక్కో అన్నాడు

2014లో టీఆర్ఎస్ తరఫున చేవెళ్ళ ఎంపీ (Chevella Mp) గా ఎన్నికయ్యారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇటీవల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లో బహిరంగ సభ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కుమార్తె సంగీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు విశ్వేశ్వర్ రెడ్డి. వీరికి ముగ్గురు కుమారులు ఆనందిత్, విశ్వజిత్, విరాజ్. రెండవ కొడుకు విశ్వజిత్ పెళ్లి జరగబోతోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కాంగ్రెస్ లో చేరారు. 2021 మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.

2011 Phool Mohammad case: పూల్ మహ్మద్ హత్య కేసులో మాజీ డీఎస్పీతో సహా 30 మందికి యావజ్జీవం..