NTV Telugu Site icon

Saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి

Aibaba Passes Away

Aibaba Passes Away

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా తుదిశ్వాస విడిచారు. ఉద్యమకారుడిగా, రచయితగా, విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2017లో జీవిత ఖైదు విధించిన గడ్చిరోలి కోర్టు.. నాగపూర్ జైల్లో శిక్ష అనుభవించారు. అనంతరం బాంబే హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా శనివారం నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సాయిబాబా మృతి పట్ల ప్రజాసంఘాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: PM Internship scheme: పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పని చేశారు. సాయిబాబాను 2014లో మావోయిస్టు గ్రూపులతో సంబంధాలున్నాయనే అనుమానంతో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన తర్వాత యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అయ్యారు. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో నిర్బంధించారు. మార్చి 2017లో మహారాష్ట్ర సెషన్స్ కోర్టు సాయిబాబాకు మరో ఐదుగురు మావోయిస్టులు మహేష్ తిర్కీ, పాండు నరోటే, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీతో సంబంధాలు ఉన్నాయని తేల్చింది. దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నట్లు భావించే కార్యకలాపాలలో పాల్గొన్నందుకు దోషులుగా నిర్ధారించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబాకు ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో విడుదలయ్యాడు.

ఇది కూడా చదవండి: PM Internship scheme: పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ ప్రారంభం