UPSC Civils: కొనసాగుతున్న యూపీఎస్‌సీ సివిల్స్ 2024 ప్రాథమిక పరీక్ష..!
- నేడు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష
- పరీక్షకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి
- దేశవ్యాప్తంగా 80 నగరాల్లో నిర్వహించనున్నారు
- యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC Civils: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నేడు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో ఈ పరీక్షను ఈరోజు నిర్వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రాల గేట్లను 30 నిమిషాల ముందే మూసివేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది. వీటితోపాటు పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, జామర్లు కూడా ఏర్పాటు చేశారు. ‘నో ఐడీ… నో ఎంట్రీ’ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా హాల్ టికెట్, ఎలాంటి గుర్తింపు కార్డు లేని వారిని పరీక్ష హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కాబట్టి, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఐడి కార్డులను తమ వెంట తీసుకెళ్లాలి.
Read also: Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 24 మందికి గాయాలు
Also Read
అలాగే ఈ ఏడాది మొత్తం 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 పోస్టులు వికలాంగులకు మాత్రమే కేటాయించారు. వ్రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతాయి. రెండు పేపర్ల పరీక్షకు 30 నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి. పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసేస్తారు. అంటే ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలోకి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. హాల్‌టికెట్‌లో ఫోటో చెల్లుబాటు కాని వారు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పాటు హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరు కావాలి.
Alcohol Drinking: మద్యం ఎక్కువగా తాగటం వల్ల సె** సామర్థ్యం తగ్గుతుందా?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!