Khammam: లోక్ సభ కౌంటింగ్ కు అంతా రెడీ.. స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర మూడంచెల భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Counting: ఖమ్మం పార్లమెంటు ఎన్నికకు సంబందించిన కౌంటింగ్ ఏర్పాట్లను అన్ని పూర్తిచేసినట్లుగా జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి గౌతమ్ చెప్పారు. పార్లమెంటు పరిదిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కు ప్రత్యేకంగా కౌంటింగ్ కేంద్రాలు అదే విదంగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక్క కౌంటింగ్ కేంద్రాన్ని మొత్తం ఎనిమిది రూమ్ లలో కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఖమ్మం అసెంబ్లీ పరిదిలో అత్యదికంగా ఓట్లు ఉన్నందున ఖమ్మం కౌంటింగ్ కేంద్రంలో 18 టేబుళ్లు , అదేవిదంగ తక్కువ ఓగట్లు ఉన్న అశ్వరావు పేట 14 టేబుల్లను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్న జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్ తెలిపారు. మొత్తం 35 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా, వారందరి తరపున 117 మంది ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
Read also: Mahbubnagar: లోక్ సభ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దం.. ఉత్కంఠకు రేపటితో తెర..
Also Read
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
- Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
- Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
గత నెల 13న పోలింగ్ ముగియగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 16,31,039 మంది ఓటర్లకు గాను 12,41,135 మంది (76.09 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంల లెక్కింపు ఒకేసారి ప్రారంభమవుతుంది. ఇక ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో 35 మంది బరిలో నిలిచారు. ఇందులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరఫున రామసహాయం రఘురాంరెడ్డి, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ తరఫున తాండ్ర వినోద్‌రావు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో 20 మంది స్వతంత్రులు, 2019 ఎన్నికల్లో 13 మంది పోటీ చేశారు. ఈసారి మరో 24 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. వీరికి వచ్చే ఓట్లు ఎవరికి ఇబ్బందికరంగా మారతాయన్నది ఆసక్తికరం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Warangal: వరంగల్ లోకసభ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి..
తాజావార్తలు
-
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
-
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!