NTV Telugu Site icon

Khammam: లోక్​ సభ కౌంటింగ్ కు అంతా రెడీ.. స్ట్రాంగ్ రూమ్​ ల దగ్గర మూడంచెల భద్రత

Khammam

Khammam

Lok Sabha Counting: ఖమ్మం పార్లమెంటు ఎన్నికకు సంబందించిన కౌంటింగ్ ఏర్పాట్లను అన్ని పూర్తిచేసినట్లుగా జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి గౌతమ్ చెప్పారు. పార్లమెంటు పరిదిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కు ప్రత్యేకంగా కౌంటింగ్ కేంద్రాలు అదే విదంగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక్క కౌంటింగ్ కేంద్రాన్ని మొత్తం ఎనిమిది రూమ్ లలో కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఖమ్మం అసెంబ్లీ పరిదిలో అత్యదికంగా ఓట్లు ఉన్నందున ఖమ్మం కౌంటింగ్ కేంద్రంలో 18 టేబుళ్లు , అదేవిదంగ తక్కువ ఓగట్లు ఉన్న అశ్వరావు పేట 14 టేబుల్లను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్న జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్ తెలిపారు. మొత్తం 35 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా, వారందరి తరపున 117 మంది ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.

Read also: Mahbubnagar: లోక్ సభ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దం.. ఉత్కంఠకు రేపటితో తెర..

గత నెల 13న పోలింగ్ ముగియగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 16,31,039 మంది ఓటర్లకు గాను 12,41,135 మంది (76.09 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంల లెక్కింపు ఒకేసారి ప్రారంభమవుతుంది. ఇక ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో 35 మంది బరిలో నిలిచారు. ఇందులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరఫున రామసహాయం రఘురాంరెడ్డి, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ తరఫున తాండ్ర వినోద్‌రావు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో 20 మంది స్వతంత్రులు, 2019 ఎన్నికల్లో 13 మంది పోటీ చేశారు. ఈసారి మరో 24 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. వీరికి వచ్చే ఓట్లు ఎవరికి ఇబ్బందికరంగా మారతాయన్నది ఆసక్తికరం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తమ గెలుపుపై ​​ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Warangal: వరంగల్ లోకసభ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి..