Site icon NTV Telugu

ల‌క్ష్యం అదే.. అమిత్‌షా ఎన్నిసార్లైనా రాష్ట్రానికి వ‌స్తాన‌న్నారు..

Etela Rajender

తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని అమిత్‌షా అన్నారు.. ఇందుకోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వ‌స్తాన‌ని తెలిపారు ఈట‌ల రాజేంద‌ర్.. అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ఈట‌ల‌.. షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారని.. ఇందుకోసం ఎన్నిసార్లు అయినా తెలంగాణ వస్తా అన్నారని వెల్లడించారు.. ఇక‌, ఎవ‌రు ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీయేన‌ని ధీమా వ్య‌క్తం చేసిన ఈట‌ల‌.. హుజురాబాద్ మాత్రమే కాదు.. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీ మాత్ర‌మే అన్నారు.

Exit mobile version