NTV Telugu Site icon

బీజేపీ గూటికి ఈటల.. ముహూర్తం ఖరారు..

Etela Rajender

Etela Rajender

బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇక, బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.. ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు ఈటల.. ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు.. కాగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్‌ లో కాస్త వెనుకో ముందే.. ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్‌ పార్టీ.. ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది.. బైపోల్‌ లో గెలిచేందుకు నాగార్జున సాగర్‌లో అనుసరించిన వ్యూహాన్ని అనుసరిస్తున్నారట.. మంత్రులను, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది టీఆర్ఎస్‌.. మరోవైపు.. వీలైనంత మంది టీఆర్ఎస్‌ నేతలను బీజేపీలో చేర్చడమే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు ఈటల రాజేందర్.