Site icon NTV Telugu

తొలిసారి బీజేపీ ఆఫీసుకు ఈటల..

తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్‌ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విజయం సాధించారు.. ఇక, ఈ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తొలిసార బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నారు ఈటల.. ఘన విజయం తర్వాత బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌కు వస్తున్న ఈటలకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి పార్టీ శ్రేణులు.. తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ పేరిట శామీర్ పేట నుంచి ర్యాలీ చేపట్టనున్నారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు శామీర్‌పేట నుంచి బయల్దేరనున్న ఆయన.. తుమ్మికుంట, అల్వాల్, ప్యారడైజ్, రాణిగంజ్, గన్‌పార్క్‌ మీదుగా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరకోనున్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి… ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు.. అక్కడ ఆయనను ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హుజురాబాద్‌ ఎన్నికల్లో ఈటల విజయం బీజేపీ శ్రేణులకు బూస్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ నేతలు సిద్ధం అవుతున్నారు.

Exit mobile version