తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు.. ఇక, ఈ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తొలిసార బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నారు ఈటల.. ఘన విజయం తర్వాత బీజేపీ హెడ్ క్వార్టర్స్‌కు వస్తున్న ఈటలకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి పార్టీ శ్రేణులు.. తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ పేరిట శామీర్ పేట నుంచి ర్యాలీ చేపట్టనున్నారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు శామీర్‌పేట నుంచి బయల్దేరనున్న ఆయన..…