NTV Telugu Site icon

Etela Rajender: మాతో గొక్కోవద్దు, ఖబడ్దార్.. ఈటల హెచ్చరిక

Etela Rajender

Etela Rajender

Etela Rajender Warns BRS Govt And CM KCR: హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో పాలన చేసే సత్తా లేదు కానీ.. కూట్లో రాయి తీయలేని వాడు ఎట్లో రాయి తియ్యడానికి పోయినట్టు.. విమానాలు వేసుకొని అన్ని పార్టీల దగ్గరికి కేసీఆర్ పోయారని ఎద్దేవా చేశారు. తనని నాయకున్ని చేయండి, దేశమంతా ఎన్నికలకు ఫండింగ్ చేస్తానని చెప్పి తిరిగొచ్చారని పేర్కొన్నారు. అయినా కేసీఆర్‌ను ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. అటు బీజేపీ కూటమి, ఇటు కాంగ్రెస్ కూటమి నమ్మక.. ఎటూ కాకుండా పోయారని కౌంటర్ వేశారు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా నమ్మడం లేదని.. అందుకే డబ్బులున్నాయని, అధికారం ఉందని మిడిసిపడొద్దని హితవు పలికారు. తమ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్.. మీ పార్టీ ఊదితే కొట్టుకుపోయే పార్టీ అని, మాతో గోక్కోవద్దు ఖబడ్దార్ అని హెచ్చరించారు.

Tulja Bhavani: తండ్రిపై మరోసారి నిప్పులు చెరిగిన తుల్జా భవాని.. మాపై కేసులు ఎందుకు?

గోషామహల్‌లో BRS నేతలు దౌర్జన్యం చేస్తున్న సందర్భంలో బీజేపీ కార్పొరేటర్ శశికళ సముదాయించే ప్రయత్నం చేశారని.. అయితే ఆమెపై అనేక సెక్షన్ల కేసులు నమోదు చేశారని ఈటల అన్నారు. బీజేపీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్‌లో అకారణంగా దాడి చేసి కొట్టారని, కేసులు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. 14 రోజులు జైల్లో పెట్టారని, ఈరోజే బెయిల్‌పై ఆమె బయటకొచ్చారన్నారు. మీర్‌పేటలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారని.. బీజేపీ కార్యకర్తలతో గిల్లికజ్జాలు పెట్టుకొని, బీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఓ సర్పంచ్ ను కొట్టి అకారణంగా జైల్లో పెట్టి వేధించారని పేర్కొన్నారు. అధికార పార్టీ అసహనంతోనే ఈ దాడులు చేయిస్తోందన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, ఇందుకు తగ్గ సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉందని అన్నారు. ఇదే సమయంలో.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేసిన వేటు తొలగింపుపై కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Samantha: సినిమాలు బ్రేక్ ఇచ్చి సామ్ ఏం చేస్తుందో చూడండి..?