Site icon NTV Telugu

నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు తన ఎమ్మెల్యే పదవికి అఫిషియల్‌గా రాజీనామా చేయనున్నారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించనున్నాడు. అనంతరం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రమే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటే మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version