NTV Telugu Site icon

Etela Rajender : 30 లక్షల మంది నిరుద్యోగ యువత నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూస్తున్నారు

Etela Rajender

Etela Rajender

సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ కు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో నిలబడి కొట్లాడిన వారు విద్యార్థులు అని ఆయన అన్నారు. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. గత పది సంవత్సరాలుగా గ్రూప్-1 ఎగ్జామ్స్ జరగలేదు. 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో మోసపోయాం అని గమనించి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే మాకు నోటిఫికేషన్ వస్తాయని భావించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో నమ్మి ఓట్లు వేశారు. ఉద్యోగ కేలండర్ విడుదల చేస్తాం… 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, ఆరు నెలలు గడిచినప్పటికీ ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు.

అంతేకాకుండా..’చదువుకునే విద్యార్థులు ఎక్కువయ్యారు కాబట్టి.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వటమే కాకుండా, జాబుల సంఖ్య కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాను. ఒక ఎగ్జామ్ కు ఇంకో ఎక్సామ్ కి కనీసం ఒక నెల అయినా గ్యాప్ ఉండేలా చూడాలని కోరుతున్నాను. మోతిలాల్ నాయక్ గత ఏడు రోజులుగా గాంధీ హాస్పిటల్ లో దీక్ష చేస్తున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వచ్చిన పాపానపోలేదు. ముఖ్యమంత్రి అసలుకే ముఖం చాటేస్తున్నారు. ఏ సంకల్పం కోసం అయితే మోతిలాల్ దీక్ష చేస్తున్నారో దానిపైన వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. గ్రూప్స్, డీఎస్సీ ఎలాంటి పోస్టులైనా ఒక ప్రకటన చేసి ఎన్ని ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇస్తారు…నెల విరామంలో ఎలా ఎగ్జామ్స్ నిర్వహిస్తారో చేస్తారో ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఇప్పటికే నిరుద్యోగులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ప్రజాక్షేత్రంలో.. ఉద్యమాలు కూడా చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాను.’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.