Etela Rajender satire on CM KCRr: సీఎంతో నేను డిమాండ్ చేసిన తర్వాత ఒక దళిత అధికారిని నియమించారని బీజేపీ శాసన సభ్యులు ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకోవటం సంతోషమన్నారు. అంబేద్కర్ కలలు కన్న జాతి నిర్మాణం జరగాలని తెలిపారు. కులాలు, అసమానతలు లేని సమాజం కోసం కలలుకన్నారని అన్నారు. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎం దళితుడని ప్రకటించిన తర్వాత తొలి ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నారు. మాల, మాదిగ అని జాతులను విడదీసారన్నారు. దళితులను ముఖ్యమంత్రి చెయ్యకపోగా ఉన్న ఒక దళిత మంత్రిని కూడా కారణాలు చెప్పి తొలగించారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
మహనీయుడు కలలు కన్న జాతికి తెలంగాణలో అడుగడుగున అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. విగ్రహాలు, సెక్రటరీయేట్ కు పేరు పెట్టినంత మాత్రాన తెలంగాణ లో న్యాయం జరగలేదని అన్నారు. సీఎంతో నేను డిమాండ్ చేసిన తర్వాత ఒక దళిత అధికారిని నియమించారని అన్నారు. తెలంగాణ ప్రజల్లో పుట్టగతులు ఉండవని తెలిసి కేసీఆర్ అంబేద్కర్ జపం అందుకున్నారని తెలిపారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, 125 అడుగుల విగ్రహం పెట్టడం సంతోషమన్నారు. తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. దళితుల అస్సైన్డ్ భూములను తిరిగి వారికి వెనక్కి ఇచ్చి వేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.
Icecream: హైదరాబాద్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ.. నకిలీ స్టిక్కర్లతో విక్రయాలు
