Site icon NTV Telugu

ఈటల అప్డేట్: రాజీనామాకి మంచి రోజు కాదట!

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌ నిన్న టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఉద్యమ నేత నుంచి టీఆర్ఎస్‌లో కీలకనేత స్థాయికి ఎదిగిన ఈటల రాజేందర్ ఎట్టకేలకు 19 ఏళ్ల అనుబంధం తరువాత టీఆర్ఎస్‌తో బంధానికి స్వస్తి పలికారు. కాగా నేడు ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించే అవకాశం ఉండగా.. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మంచి రోజు కోసం చూస్తున్న ఈటలకు తన రాజీనామా లేఖను నేడు స్పీకర్ కు ఇచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన రాజీనామా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా ఈ నెల 11వ తేదీ తర్వాత ఈటల ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈటలతో పాటు మరికొందరు ఉద్యమ నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.

Exit mobile version