సింగరేణి కార్మిక చైతన్య యాత్ర ముగింపు సభలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిర్వహించిన సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన కూడా సింగరేణిని ఇంకా దారిద్య్ర పరిస్థితికి కారణం కేసీఆర్ అనే ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నన్ను టీఆర్‌ఎస్ పార్టీ నుండి మెడలు పట్టి బయటికి పంపించిందని, అయినా నాకు ఇంకో సారి తెలంగాణ కొరకు యుద్ధం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు. నన్ను తగలపెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ చివారికి మీరే తగలబడతారని హెచ్చరించారు.
అంతేకాకుండా.. ఒకప్పుడు 1 లక్ష 20 వేల కార్మికులు సింగరేణి సంస్ధలో పనిచేసేవారని.. తెలంగాణలో ప్రస్తుతం 43 వేల కార్మికులు మాత్రమే ఉన్నారన్నారు. కార్మికుల సంఖ్య తగ్గడానికి ముఖ్య కారణము కేసీఆరేనని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కేవలం ఒక్క బొగ్గుగనికి మాత్రమే శంకుస్థాపన చేయడం దారుణమన్న ఈటల.. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది.. కేసీఆర్ ని బొందపెడితే తప్ప తెలంగాణ బాగుపడదన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.