Site icon NTV Telugu

హరీశ్ రావు.. నీకు నా గతే పడుతుంది: ఈటల రాజేందర్

మాజీమంత్రి ఈటల రాజేందర్ మరోసారి అధికార పార్టీ టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఉపప్రచారంలో భాగంగా నెరెళ్ళ ఊరిలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నెరెళ్ళ ధర్మం తప్పదన్నారు. ఎవరి ప్రచారం వారిని చేసుకోనివ్వండి. బీజేపీ పార్టీ జెండాలు పీకెయ్యడంపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మేము తలుచుకుంటే వేరే ఉంటాడని హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లు ఎటు పోయినారు..? కేసీఆర్ దళితుల మీద ప్రేమ ఒక మోసం.. దళిత సీఎం ఎటుపోయింది? ఉప ముఖ్యమంత్రిని ఎందుకు పీకినవ్? మూడు ఎకరాల భూమి ఎటు పోయింది? పెన్షన్లు ఎటు పోయినాయి? అంటూ ఈటల విమర్శించారు. ఎరబల్లి నీచేతిలో ఉందా? 10 కోట్లు ఇచ్చిన మా ప్రజలు ఆత్మను అమ్ముకోరు. మా డబ్బుతో సోకులు చేసేది మీరు. రంగనాయక సాగర్ కి తీసుకుపోయి మనుషులను కొంటున్నావ్.. హరీశ్ రావు నిన్ను కూడాకేసీఆర్ వదిలి పెట్టడు. నీకు నా గతే పడుతుంది’ అంటూ ఈటల విమర్శలు చేశారు.

Exit mobile version