సామాన్యులకు అధికారం లేకుండా చేసిన దుర్మార్గ పార్టీ టీఆర్‌ఎస్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ధర్మాన్ని చెరబట్టలనే చూసే పార్టీ టీఆర్‌ఎస్ అని, ధర్మం నిజమైతే వేల కోట్లు రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయే కేసీఆర్ చెప్పాలన్నారు. సిద్దిపేటలోని కేసీఆర్ భూమి అమ్మి ప్రజలకు ఇవ్వడం లేదు మన సొమ్ము మనకే ఇస్తుండని ఆయన విమర్శించారు. 24గంటల కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు పంట పాలు పోసుకునే దశలో ఉందని, దళిత బంధు ఒక హుజురాబాద్ లో మాత్రమే 10లక్షలు ఇస్తుండు తప్ప మిగతా చోట్ల 10లక్షలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు తమ బాధల్ని గుండెల్లో పెట్టుకొని సమయం వచ్చినపుడు కర్రు కాల్చి వాత పెడుతారని ఆయన జోస్యం చెప్పారు. 33శాతం రిజర్వేషన్ ను బీసీలకు అమలు చేయాలన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ఇచ్చే డబ్బు సంచులు తీసుకొని ధర్మానికి, న్యాయానికి ఓటు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ పార్టీ బ్రతికి ఉన్నత వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులే సీఎంలు అవుతారు, వారే పార్టీ అధ్యక్షుడు అవుతారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో సామాన్యుడు కూడా రాష్ట్రానికి సీఎం అవుతాడు, పీఎం అవుతారన్నారు. నేను ఎదుగుతూ ఉంటే ఓర్వలేక నన్ను తుంచే ప్రయత్నం చేశారు, రేపు నీకు కూడా సమయం వస్తుంది హరీష్ రావు అని వ్యాఖ్యానించారు. నేను ఆత్మ గౌరవం ఉన్న బిడ్డగా బానిసత్వం నుండి బయట పడ్డనని, తెలంగాణ ప్రజలు ఇలాంటి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కుల్చాలి, ఆనాటి ఉద్యమం తరహాలో బాధ్యత తీసుకుంటా నేను అని ఆయన వెల్లడించారు.
