NTV Telugu Site icon

Etela Rajender : అప్పులు చేసిన శ్రీలంక గతి ఏమైందో చూస్తున్నాం

Etela Rajender Bjp Office

Etela Rajender Bjp Office

BJP MLA Etela Rajender Fired on CM K.Chandrashekar Rao.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ మాక్‌ పోలింగ్‌ కార్యక్రమంలో హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అప్పులు చేసిన శ్రీలంక గతి ఏమైందో చూస్తున్నామని, తెలంగాణలో 60 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అప్పుకోసం కడుతున్నారన్నారు. పెట్టే ఖర్చులో 1/3 అప్పు కోసం అప్పు కట్టడానికే పోతుందని ఆయన వెల్లడించారు. సీఎంగా బాధ్యత ఉండాలి.. అధికారం ఉందని నీ తాత జాగీరులాగా చేయవద్దు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించండి. భిన్నంగా వెళితే ఎవరు అనుమతించరంటూ ఆయన మండిపడ్డారు.

Bandi Sanjay : కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రబొదానుసారం ఓటు వేయండని, ఆయన వ్యాఖ్యానించారు. ద్రౌపది ముర్ము గారు గొప్ప మెజారిటీతో గెలవబోతున్నారు.. ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు. వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని మేం ముగ్గురు ఎమ్మెల్యేలం కేంద్ర ప్రభుత్వాన్ని కొరామన్నారు. రాష్ట్ర పార్టీ ద్వారా కూడా నివేదిక పంపించామన్నారు. మా ముగ్గురు ఎమ్మెల్యేలం ముంపుకు గురి అయిన ప్రాంతాలను సందర్శిస్తామని వెల్లడించా