Site icon NTV Telugu

Etela Rajender: పార్టీ నుండి నేను వెల్లలేదు.. వేళ్ళగొట్టారు..!

Cm Kcr Etala Rajender

Cm Kcr Etala Rajender

Etela Rajender: పార్టీ నుండి నేను వెల్లిపోలేదు అయన వేళ్ళగొట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. చిల్లర గుండా నాయకులతో నన్ను తిట్టిస్తే తిట్టిస్తవేమో కానీ 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నావో చెప్పని? ప్రశ్నించారు. ఇన్కమ్ టాక్స్ ఎగవేత కోసం తోటలు పెట్టుకున్న వారికి రైతు బందు అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసమే పుట్టానని చెబుతున్న కేసిఆర్ ఇప్పటికైనా భూమి మీద నడువు అని ఈటెల మండిపడ్డారు. చీటర్ లను, బ్రోకర్ లను పెట్టుకొని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 లో నీ ఆస్తులు 2023 లో నీ ఆస్తులు నా ఆస్తులు ఏంది చర్చకు రెడీ నా? అంటూ సవాల్‌ విసిరారు. బీసీ మంత్రి మాట్లాడుతున్నారు ఎంత మంది బీసీ మంత్రులు ఉన్నారో చెప్పాలి? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Read also: Indrakaran Reddy: ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ పర్యటన.. మంత్రి స‌మ‌క్షంలో 100 మంది చేరిక

మాదిగ లకు ఒక మంత్రిత్వ శాఖ లేదన్నారు. 0.6 శాతం ఉన్న మీ సామాజిక వర్గానికే అన్ని అంటూ ఆరోపించారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది కేసీఆర్ అంటూ ఆరోపించారు. పార్టీ నుండి నేను వెల్లిపోలేదు అయన వేళ్ళగొట్టారు అంటూ తన ఆవేదనను మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. మా లాంటి వాళ్ళము ఎన్ని సార్లు ఎడ్చామో కేటీఆర్ కి తెలియదా? అని ప్రశ్నించారు. NTR టికెట్ ఇచ్చారు ఆయనకు మోసం చేశావని నేను అనలేదన్నారు. మోసానికి ,ద్రోహానికి మారుపేరు కేసీఆర్‌ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దయాకర్ రావు నువ్వు చదువుకున్నవ లేదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి నన్ను రానిస్తారో లేదో తెలియదన్నారు. కేసీఆర్‌ నీ కుట్రలలో ఇరికం అన్న ఆయన.. ఎమ్మేల్యేలను అవమానిస్తే శిలాఫలకాలను పగలకొడుతామన్నారు. నా నియోజక వర్గం లో జరిగిన కార్యక్రమానికి నన్ను ఎందుకు పిలవ లేదని ప్రశ్నించారు.
Etala Rahebder: దమ్ముంటే ఆ లెక్కలపై చర్చకు రండి.. మంత్రులకు ఈటెల సవాల్‌

Exit mobile version