NTV Telugu Site icon

Etela Rajender: కార్యకర్తగా నా బాధ్యతను నిర్వహిస్తా.. బీజేపీ గెలుపుకు శ్రమిస్తా

Etela Rajender

Etela Rajender

Etela Rajender Comments After Appointed As Chairman Of Election Management Committee: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కి బీజేపీ హైకమాండ్ ఎన్నికల కమిటీ నిర్వహణ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ కార్పొరేటర్‌తో కలిసి.. హయత్ నగర్‌లోని కార్పొరేటర్ జీవన్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. తన మీద విశ్వాసం ఉంచి ఈ భాద్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, సంతోష్ జీ, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ధన్యవాదములు తెలిపారు. తనకు తెలంగాణ అంతరంగం, సమస్యలన్నీ తెలుసని.. కేసీఆర్ బలం, బలహీనతలు సైతం తెలుసని అన్నారు. తాను ఒక కార్యకర్తగా తన బాధ్యత‌ను సంపూర్ణంగా నిర్వహిస్తానన్నారు. కిషన్ రెడ్డి ఓ సీనియర్ నాయకుడని, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని, ఆయనతో కలిసి పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు.

Shabbir Ali: సీఎం కేసీఆర్‌కు షబ్బీర్ అలీ ఛాలెంజ్.. దమ్ముంటే ఆ వివరాలు బయటపెట్టాలి

నేషనల్ ఎక్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, బీజేపీ జాతీయ నాయకుడు జేపీ నడ్డాకు ప్రధాని మోడీ బాధ్యతలు అప్పగించారని ఈటల గుర్తు చేశారు. ఆరోజే కేంద్ర ప్రభుత్వం, బీజీపీ కేంద్ర నాయకత్వం సంపూర్ణ సహకారంతో.. గత 40 సంవత్సరాలుగా అధికారం కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కంటున్న కలలు, ఆశయాల్ని సంపూర్ణం చేసే బాధ్యత తనపై ఉందని భావించానని అన్నారు. అందులో భాగంగానే.. తన మీద నమ్మకంతో, అలాగే తనకున్న రాజకీయ అనుభవంతో తనకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను అప్పగించారన్నారు. ఇందుకు జాతీయ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతలని సంపూర్ణంగా నిర్వహిస్తానంటూ హామీ ఇచ్చారు. రాజకీయంలో ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయని.. వాటన్నింటినీ ఎదుర్కొని, బీజేపీ పార్టీ గెలుపు కోసం పురోగమిస్తానని ఈటల చెప్పుకొచ్చారు.

Bandi Sanjay: కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకుపోవాల్సి వస్తుంది

Show comments