Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: బిఆర్ఎస్ ఇచ్చే మూడు పంటలు కావాలా.. కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంట్ కావాలా?

Errabelli On Congress

Errabelli On Congress

Errabelli Dayakar Rao Sensational Comments On Congress Party: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీపై తాజాగా విమర్శలు గుప్పించారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎప్పుడూ రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. అసలు రైతులపై కాంగ్రెస్ పార్టీకి కనికరం లేదన్నారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. కేటీఆర్ పిలుపుమేరకు పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్‌లో రైతులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఇచ్చే మూడు పంటలు కావాలా? కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంట్ కావాలా? అని రైతుల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని కొనియాడారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని.. ఆయన రైతు బంధవుడని కొనియాడారు.

CPI Narayana: పవన్ ఓ రాజకీయ బ్రోకర్.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు కూడా.. ఒకప్పుడు క‌రెంటు క‌ష్టాల‌కు కాంగ్రెస్‌ పార్టీనే కారణమంటూ మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. అస‌మ‌ర్థ, దుష్ట పాల‌న వ‌ల్ల రైతులు అరిగోస ప‌డ్డారని.. అందుకే ఆ పార్టీకి ప్రజలు చ‌ర‌మ‌గీతం పాడారని పేర్కొన్నారు. అయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని.. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా వ్యవసాయానికి కేవలం 3 గంట‌ల కరెంట్ చాలని చెప్పాడని మండిపడ్డారు. వ్యవసాయం గురించి తెలిసినోడు అలాంటి మాటలు మాట్లాడుతారా? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యల‌తో రైతులు నవ్వుకుంటున్నారని, న‌వ్వుల‌పాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాల‌ని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖంగా మాట్లాడుతోందని.. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందంటే, దొడ్లో క‌ట్టేయ‌మ‌న్నట్లు కాంగ్రెస్‌ పరిస్థితి ఉందని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. కొత్త నెంబర్ సేవ్ చేయకుండానే చాట్ చేసే ఛాన్స్

Exit mobile version