Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: ఆఖరి గింజవరకూ కొంటాం.. టెన్షన్ వద్దు

Errabelli

Errabelli

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామా రెడ్డి గూడెంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్ట మొదటి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రైతు బంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

గోదావరి నీటిని మన ఇండ్లకు, పొలాలకు తెచ్చిన ఘనత మహానుభావుడైన సీఎం కేసీఆర్ ది. కాంగ్రెస్, బీజేపీ లు నీళ్ళ కోసం అలమటిస్తున్న ప్రజలని ఏనాడూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ నీళ్ళ ను తెచ్చారా? లేదా? నీళ్ళే కాదు, 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆర్ కాదా?అన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా? రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. కనుకే రైతుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, 3 వేల కోట్ల నష్టం వస్తున్నా, వడ్లు మళ్ళీ కొనుగోలు చేస్తున్నారు. క్వింటా వడ్లకు 600 రూపాయల నష్టం వచ్చినా భరిస్తున్నామన్నారు. బీజేపీ వాళ్లు మొన్నటిదాకా కేసీఆర్ కి సంబంధం లేదు, నేను కేంద్రంతో కొనిపిస్తామన్నారు. చేతగాని దద్దమ్మలు… ఇప్పుడు కేసీఆర్ కొంటుంటే, మేమే కొనిపిస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వాళ్ళ మాటలు నమ్మ వద్దు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. రైతులు పండించిన ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నాం. త్వరలోనే అభయ హస్తం నిధులు తిరిగి వడ్డీతో పాటు ఇచ్చి, పెన్షన్లు కూడా ఇస్తున్నాం.

పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చెప్పిన మొదటి రోజే సమీక్షించి, రెండో రోజే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం గ్రామంలో ప్రారంభించారు. ఇంత తక్కువ టైంలో రెడీ చేసిన అధికారులకు అభినందనలు. బియ్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రందే. FCI ద్వారా కొనుగోలు సాగుతుంది. కరువు, కాటకాల్లో, అత్యవసర, యుద్ధ సమయంలో కేంద్రం బాధ్యత తీసుకుంటుంది. అయితే, కేంద్రం చేతులు ఎత్తేసిందన్నా పల్లా. సీఎం స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు.

Read Also: Kcr Master Plan: రాష్ట్రపతి ఎన్నికలు.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్

మంత్రులు స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కూడా కలిశారు. 1500 మిల్లులను నిలపలేము. లక్షలాది మంది రైతులను ఆపలేమని చెప్పాం. అయినా కేంద్రం మొందికేసింది. సీఎం కెసిఆర్ మాత్రం నష్టం వచ్చినా సరే, కొనాలని నిర్ణయించారు. కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదు. బీజేపీ వాళ్లు రాహుల్ ను తిడుతున్నారు. అడ్డుకునే శక్తి లేదు. బండి సంజయ్ నీకు చీము నెత్తురు ఉంటే, ఆత్మగౌరవం లేని మాటలు మానేయి. పదవులు రాగానే పెదవులు మూసుకుంటున్నారని మండిపడ్డారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. గుజరాత్ లో 6 గంటల కరెంట్ కూడా ఇవ్వలేని దద్దమ్మలు. సీఎం కేసీఆర్ మీద కొట్లాడటం కాదు, మీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ మీద కొట్లాడండి. ఆర్డీఎస్ మీద మాట్లాడే హక్కు డీకే అరుణకు లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులను కాంగ్రెస్ పెండింగులో పెట్టింది. బీజేపీ సహాయ నిరాకరణ చేసింది. సీఎం కెసీఆర్ ఆ ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు.

Exit mobile version