NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao criticizes Chandrababu Naidu: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆంధ్రాలో, తెలంగాణలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. టీడీపీ చంద్రబాబు పార్టీ కాదని అన్నారు. టీడీపీ ఎన్టీరామారావు పార్టీ అని అన్నారు. మధ్యలో వచ్చినవాడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఎన్టీఆర్‌ని చంద్రబాబు మోసం చేశాడని.. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఆయన కుటుంబానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కుట్రపూరితంగా తన కొడుకును లోకేష్ ను ఫోకస్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. లోకేష్ ను ఎవ్వరూ కోరుకోవడం లేదని అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ని ప్రజలు కోరుకుంటున్నారని.. పార్టీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటేనే బాగుంటుందని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారని ఎర్రబెల్లి అన్నారు. ఆంధ్రలో ముఖ్యమంత్రిగా జూనియర్ ఎన్టీఆర్ ఉండాలని కోరుకుంటున్నారు. తెలుగు దేశం, ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ని సీఎం చేయాలని.. ఇలా చేస్తే నీకు ఎన్టీఆర్ కుటుంబం ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందో అని అన్నారు. లోకేష్ ను ఎక్స్‌పోజ్ చేస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు.

Read Also: Charles Sobhraj: ఆయనకు 64, ఆమెకు 21.. సీరియల్ కిల్లర్‌తో మూడుముళ్ళు..

హరికృష్ణ బిడ్డను తెలంగాణలో ఎన్నికల్లో పెట్టి ఓడించారని మండిపడ్డారు. ఎక్కడా పొద్దుపోక తెలంగాణకు వస్తుండని విమర్శించారు. ఇక్కడ చిచ్చపెట్టేందుకు గతంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేశాడని దుయ్యబట్టారు. ఇప్పుడు బీజేపీతో ములాఖత్ అయి చిచ్చుపెట్టాలని చూస్తుండు అని అన్నారు. తెలంగాణలో కేఏపాల్, షర్మిల మాదిరిగా చిచ్చుపెట్టాలని చూస్తుండని ఎర్రబెల్లి విమర్శించారు.

ఉపాధి హామీని తెలంగాణలో రద్దు చేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా 25 వేల కోట్లు ఉపాధి హామి నిధులు నిలిపివేసింది. సముద్రం ఒడ్డున చేపలు ఎండబెట్టడానికి కల్లాలకు నిధులు ఇస్తోంది కానీ తెలంగాణలో రైతుల కల్లాలకు డబ్బులు ఇవ్వడం లేదన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు జిల్లా కేంద్రంలో ధర్నాలు చేస్తామని, కేంద్రం దిగివచ్చే వరకు పతమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

Show comments