Site icon NTV Telugu

Chikoti Casino Case: కేసినో కేసు.. నేడు ఈడీ ముందుకు హాజరైన MLC ఎల్ రమణ

Mlc L.ramana

Mlc L.ramana

ED forward MLC L. Ramana: తెలంగాణలో ‘చీకోటి’ క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. దీంతో.. ఈడీ విచారణ రాజకీయ వేడిని పెంచుతోంది. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్‌ క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్న నేతల్లో వణుకు మొదలైంది. ఇవాళ కేసినో కేసులో ఈడీ ముందు MLC ఎల్ రమణ విచారణకు హాజరయ్యారు. విదేశీ టూర్స్, బ్యాంకు లావాదేవీలతో ఎల్ రమణ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ ముగిసాక వివరంగా మాట్లాడతా అని ఎల్.రమణ తెలిపారు.

Read also:GVL Narasimha Rao: లిక్కర్ స్కాంలో విజయవాడనుంచి డబ్బులు తరలింపు

ఇప్పటికే బుధవారం మంత్రి తలసాని సోదరులైన మహేష్, ధర్మేంద్రలను దాదాపు 10గంటల పాటు ఈడీ విచారించింది. క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఫెమా యాక్ట్‌ నిబంధనల ఉల్లంఘనలు, మనీలాండరింగ్‌, హవాలా చెల్లింపులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. శుక్రవారం వీళ్లిద్దరినీ మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ వైద్యులు అంకాలజిస్ట్ వంశీకి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు పంపించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గురునాథ్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. హవాలా చెల్లింపులు, మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను గతంలో నాలుగు రోజులపాటు ఈడీ విచారించింది. గురువారం, నేడు(శుక్రవారం) విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ కుమార్‌తో సంబంధాలున్న పలువురిని ఈడీ విచారిస్తోంది. క్యాసినో కేసులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయవేత్తలకు ప్రమేయం ఉందని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు భావిస్తున్నారు. అనుమానం ఉన్న వారికి చెందిన నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దీంతో చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉ‍న్న రాజకీయ నేతల్లో టెన్షన్‌ మొదలైంది. ఇక వచ్చేవారం ఈడీ ముందుకు మంత్రి తలసాని పీఏ హరీష్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Tiger in Asifabad: కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం.. రోడ్డు దాటుతుండగా..

Exit mobile version