NTV Telugu Site icon

Graduate MLC Bypoll: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ..

Graduate Mlc Bypoll

Graduate Mlc Bypoll

Graduate MLC Bypoll: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్, ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల ఫలితాలు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 26 మంది ఎలిమినేట్ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎలిమినేషన్ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 220 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 139 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 118 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు వచ్చాయి. ఓవరాల్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోటా 1,55,095గా నిర్ణయించారు.

Read also: N. Uttam Kumar Reddy: నేడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మంత్రి ఉత్తమ్‌

మల్లన్న గెలవాలంటే 32,282 రెండో ప్రాధాన్యత ఓట్లు అవసరం కాగా, రాకేష్ రెడ్డి గెలవాలంటే 50,847 ఓట్లు కావాలి. ఈసారి 25,824 ఓట్లు చెల్లవని అధికారులు గుర్తించారు. మరోవైపు ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అసలు లెక్కలకు, నమోదైన లెక్కలకు పొంతన లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌంటింగ్ టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపుకు, ఆర్‌ఓ ప్రకటించిన ఓట్లకు మధ్య తేడాను సరిచేయాలని ఈసీని కోరింది. ఈ విషయమై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గురువారం రాత్రి బీఆర్‌కేఆర్‌ భవన్‌కు వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థికి లాభం చేకూర్చే విధంగా కౌంటింగ్ అధికారులు లెక్కలు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Hyderabad: కూలీ పెంచండి.. నేడు హమాలీ కార్మికుల నిరసన..