Site icon NTV Telugu

CMD Raghuma Reddy : విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్.. ఈ నెంబర్లకు కాల్‌ చేయండి..

Heavy Rains

Heavy Rains

ఈ రోజు తెల్లవారుజామున ఒక్క సారిగా కురిసిన భారీ వర్షం, గాలుల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని సీజీమ్, సూపరింటిండెంట్‌ ఇంజినీర్లతో సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కూలిన చెట్ల మూలాన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని ఆయన అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రఘుమా రెడ్డి మాట్లాడుతూ.. చెట్ల తొలిగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో విద్యుత్ శాఖ ఉందని ప్రజలకు సూచించారు.

చెట్ల మీద, వాహనాల మీద విద్యుత్ వైర్లు పడితే వాటిని తాకే ప్రయత్నం చేయవద్దని, రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి పోరాదు సీఎండీ రఘుమా రెడ్డి వెల్లడించారు. సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు.. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన హైదరాబాద్‌ వాసులకు సూచించారు.

Exit mobile version