TS Electric Power: రికార్డుస్థాయిలో విద్యుత్తు వినియోగం.. మే నెల రికార్డులు మార్చిలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Electric Power: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మే నెలలో నమోదైన రికార్డు వినియోగం మార్చి నెలలోనే నమోదు కావడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 289.697 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. మార్చి చివరి వారంలో నమోదైన రికార్డు మార్చి మొదటి వారంలో బద్దలైంది. నిరుడు మార్చి 30న రాష్ట్రంలో 15,497 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి 8న 15,623 మెగావాట్లతో ఆ రికార్డును అధిగమించింది. ఈ ఏడాది మార్చి 14న అత్యధికంగా 308.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది.
Read also: KCR: కేసీఆర్ జిల్లాల పర్యటన.. ఎప్పుడంటే..
Also Read
ఎండలు మండిపోతుండడం, వరుస సెలవుల కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండడంతో పట్టణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లోనే గృహ విద్యుత్ వినియోగం 15 శాతం పెరిగింది. గ్రేటర్‌లో వినియోగదారుల సంఖ్య పెరగడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ వినియోగం రికార్డులను తిరగరాస్తోంది. మే 19న రికార్డు స్థాయిలో 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్ నమోదైంది. గత గురువారం ఒక్కరోజే గ్రేటర్ లోనే రికార్డు స్థాయిలో 79.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదు కావడం గమనార్హం.
Read also: Padmavati Express: సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..
ఇక మార్చిలో గ్రేటర్ విద్యుత్ వినియోగం 67.97 మిలియన్ యూనిట్లు మాత్రమే. మార్చి నెలలో సగటు విద్యుత్ వినియోగం 57.84 మిలియన్ యూనిట్లు. ఈ ఏడాది మార్చి వరకు సగటు విద్యుత్ వినియోగం 70.96 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. ఇది దాదాపు 22.7 శాతం పెరుగుదల. 15 జిల్లాలతో కూడిన టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ను పరిశీలిస్తే, 2023 మార్చి 3న 188.60 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా, ఈ ఏడాది మార్చి 13న గరిష్ట వినియోగం 202.45 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.
Mukhtar Ansari : ముఖ్తార్ అంత్యక్రియలకు..ఐజీ, డీఐజీ నుంచి 5000 మంది పోలీసుల మోహరింపు
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!