రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది ఇది అందరికి తెలిసిన విషయమే.. అయితే రోజు ఎక్కడో ఓ చోట సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారు. జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఓ మహిళతో ఓ పెద్దాయన గొడవ పడ్డాడు. తన సీటు తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Special Fan: టేబుల్ ఫ్యాన్ కు.. సీలింగ్ ఫ్యాన్ సెట్ చేసిన యువకుడు
హైదారాబాద్ పటాన్ చెరు నుంచి కోఠికి వెళుతున్న బస్సులో ఓ మహిళ సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చుంది. అయితే ఓ పెద్దాయన అక్కడికి వచ్చి.. అది మాకు రిజర్వ్ అయిన సీటు మీరు అక్కడి నుంచి లేవాలని కోరాడు. ఆ మహిళ లేవకపోవడంతో..ఇద్దరి వాగ్వాదం జరిగింది.. కాసేపటికి వాగ్వాదం కాస్త ముదిరి గొడవకు దారితీసింది. ఫ్రీ జర్నీ చేసే మీకే ఇంత రుబాబు.. ఉంటే.. డబ్బులిచ్చి టికెట్ కొనుక్కుని వెళ్లే మాకు ఎంత ఉండాలని.. మహిళపై గరం అయ్యాడు.
Read Also: Periods: మగాళ్లకు పీరియడ్స్ రావడం ఏంటీ.. సోషల్ మీడియాలో వైరల్
అయినప్పటికి మహిళ సీటులోంచి లేవకపోవడంతో ..ఆ పెద్దాయన ఫోన్ కెమెరాతో మహిళను, సీటును రికార్డు చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ మహిళ నన్ను ఎందుకు రికార్డ్ చేస్తున్నావని ఆగ్రహించింది. తోటి ప్రయాణికులు సపోర్ట్ చేశారు. అనంతరం ఆ మహిళ స్టేజీ రాగానే బస్సు దిగి వెళ్లిపోయింది. ఈ తతంగమంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో తెగ వైరల్ అయ్యింది. దీంతో కొందరు పెద్దాయనని విమర్శిస్తే.. మరికొందరు ఆయన చేసింది కరెక్టే అంటూ.. మద్దతు తెలుపుతూ.. కామెంట్లు పెడుతున్నారు.
సిటీ బస్సులో సీటు కోసం మహిళ, సీనియర్ సిటిజన్ మధ్య గొడవ
పటాన్‌చెరు నుండి కోఠికి వెళ్ళే బస్సులో సీనియర్ సిటిజన్‌కు రిజర్వ్ అయిన సీటులో కూర్చున్న మహిళ
రిజర్వ్ అయిన సీటు కోసం మహిళ, సీనియర్ సిటిజన్ మధ్య గొడవ
ఫ్రీ జర్నీకి ఇంత రుబాబా? అంటూ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీనియర్ సిటిజన్ pic.twitter.com/fkkitTtzyo
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2025