Delhi Liqour Scam: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈ రోజు సుదీర్ఘంగా ప్రశ్నించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత.. రాత్రి 8 గంటల తర్వాత బయటకు వచ్చారు.. అయితే, విచారణ ఆలస్యం అవుతున్న కొద్దీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.. కవిత ఎప్పుడు బయటకు వస్తురు? అనే బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూశాయి.. చివరకు 8 గంటల తర్వాత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు కవిత.. మీడియా మాట్లాడకుండా.. కారులో నుంచి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.. ఇక, ఢిల్లీలోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న ఆమెకు.. బీఆర్ఎస్ శ్రేణులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు..
Read Also: Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్.. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం..!
అయితే, కవిత విచారణ ఇవాళ్టితో ముగిసిపోలేదు.. ఈ నెల 16వ తేదీన మరోసారి ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాల్సింది.. 16వ తేదీన విచారణకు రావాలంటూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ రోజు దాదాపు 9 గంటలుగా ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించింది ఈడీ.. రామచంద్ర పిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు వేసింది.. ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం.. అంటే జాయింట్ డైరెక్టర్, లేడీ డిప్యూటీ డైరెక్టర్ ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లతో కూడిన ఈడీ టీమ్ కవితను ప్రశ్నించింది. కవిత వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది ఈడీ.. ఇక, తాజా నోటీసులతో ఈ నెల 16వ తేదీన కవిత ఈడీ ముందు హాజరు కానుండగా.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఉత్కంఠగా మారింది.