కరీంనగర్‌లో 9 గ్రానైట్ పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది ఈడీ.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశారని ఫిర్యాదు చేశారు బండి సంజయ్.. దీంతో రంగంలోకి దిగిన ఈడీ… ఎంత గ్రానైట్ ఎగుమతి చేశారో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
కాగా, కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం మీదుగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేసినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు బండి సంజయ్… దీంతో, విదేశాలకు ఎంత గ్రానైట్ ఎగుమతి చేశారో వివరణ ఇవ్వాలని తాను జారీ చేసిన నోటీసుల్లో కోరింది ఈడీ.. గత నెలలో చెన్నై ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది ఈడీ.. ఇక, కరంనగర్‌లోని శ్వేత ఏజెన్సీ, ఎఎస్ షిప్పింగ్, జేఎం బ్యాక్సీ, మైథిలి ఆధిత్యట్రాన్స్ పోర్ట్, కేవీఎ ఎనర్జీ, అరవింద్ గ్రానైట్, శాండియా ఏజెన్సీస్, పి.ఎస్.ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్‌లు ఈడీ నోటీసులు అందుకున్నాయి.. ఎంత మేరకు గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేశారో వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది ఈడీ.