Site icon NTV Telugu

Drugs Case: ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్లో కీలకాంశాలు

సంచలనం కలిగించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకాంశాలు బయటకు వస్తున్నాయి. ఈడీ దాఖలుచేసిన కోర్టీ ధిక్కరణ పిటిషన్ విచారణకు రానుంది. కెల్విన్ కూల్ ప్యాడ్ లో సినీతారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించడంలేదని ఈడీ కోర్టుకి తెలిపింది.

https://ntvtelugu.com/governor-tamilisai-tour-in-nallamala-forest/

సినీతారల కాల్ రికార్డ్స్ ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించలేదని ఈడీ పేర్కొంది. ఇప్పటి వరకు ఆరు లేఖలు వ్రాసినా వివరాలు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ససేమిరా అంటోందని ఈడీ తెలిపింది. సినీతారలు సహా 41మందిని ఎక్సైజ్ శాఖ విచారించిందని ఈడీ తెలిపింది. డిజిటల్ రికార్డ్స్ , వాంగ్మూలాలు, కాల్ రికార్డ్స్ ఇవ్వటం లేదని తెలిపింది. సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ ల పై చర్యలు తీసుకోవాలని ధిక్కరణ పిటిషన్లో ఈడీ పేర్కొంది. కెల్విన్ కూల్ ప్యాడ్ లోని కాల్ రికార్డ్స్ ఇవ్వడంలేదని ఈడీ తెలిపింది.

తాము సేకరించిన ఆధారాలు ట్రైల్ కోర్టులో ఉన్నాయన్న ఎక్సైజ్ శాఖ వాదనలో వాస్తవం లేదని హైకోర్టులో ఈడీ తెలిపింది. 12కేసుల్లో 23మంది నిందితులున్నా ఐదుగురు వాంగ్మూలాలు మాత్రమే ట్రైల్ కోర్టులో లభ్యం అయ్యాయని ఈడీ కోర్టు దృష్టికి తెచ్చింది. సోమవారం ఈడీ పిటీషన్ పై విచారించనుంది హైకోర్టు. ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version