NTV Telugu Site icon

BJP Floor Leader: లాస్ట్‌ ‘ఆర్‌’ కే ఆ ఛాన్స్‌..! ఫ్లోర్‌ లీడర్‌ రేసులో ఈటల..!

Eatala Rajender

Eatala Rajender

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య మూడు.. ఆ పార్టీ శ్రేణులు వారిని ఆర్‌ఆర్ఆర్‌గా పిల్చుకుంటున్నారు… రాజాసింగ్‌, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.. అయితే, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి రఘునందన్‌రావు, హుజురాబాద్‌ బైపోల్‌లో నెగ్గి ఈటల రాజేందర్‌ సభలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, అప్పడికే పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌ మొన్నటి వరకు శాసనసభలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా కొనసాగుతూ వచ్చారు. కానీ, ఓ వివాదాస్పద వీడియోను ఆయను జైలులోకి నెట్టింది.. పీడీ యాక్ట్‌ నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.. అంతేకాదు.. పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యవహరించారంటూ.. రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది బీజేపీ. అయితే, ఇప్పుడు రెండో ఆర్‌ (రఘునందన్‌రావు) కాకుండా.. మూడో ఆర్‌ (ఈటల రాజేందర్‌)ను ఫ్లోర్‌ లీడర్‌గా చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Read Also: CPI Narayana: సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకుంటున్నారు.. తెలంగాణ గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలి..!

గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్.. మహమ్మద్‌ ప్రవక్తపై ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలపై పార్టీ సస్పెండ్ చేయడం.. జైలులో ఉన్నందున, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పార్టీ ఫ్లోర్ లీడర్‌గా బీజేపీ నియమించే అవకాశం ఉంది.. అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత ఈటల రాజేందర్‌.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా పనిచేసిన ఈటల వైపే.. పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే ఈటల రాజేందర్‌.. జాయినింగ్స్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు.. రాజా సింగ్ పోస్ట్‌ భర్తీపై చర్చ ప్రారంభమైనందున రాజేందరే ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బీజేపీలో మాత్రం దుబ్బాక ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు.. ఈటల కంటే సీనియర్‌గా ఉన్నారు.. కానీ, బీజేపీ అధిష్టానం మాత్రం ఈటల వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

Show comments