Site icon NTV Telugu

EAP CET: నేటినుంచి ఎప్ సెట్ ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Eapcet

Eapcet

తెలంగాణలో నేటి నుంచి రెండు రోజుల పాటు ఎప్ (EAP CET) సెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. ఇక మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. ఎప్ సెట్ పరీక్షకు 3 లక్షల 6 వేల 796 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 2 లక్షల 20 వేల 49 దరఖాస్తులు వచ్చాయి.

ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేకపోవడంతో గతేడాది కన్నా ఇప్పుడు దరఖాస్తులు తగ్గాయి. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మార్నింగ్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. ఇక మధ్యాహ్నం సెషన్ 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

ఇది కూడా చదవండి: Vaibhav Suryavanshi: సిక్సులతో విరుచకపడ్డ వైభవ్ సూర్యవంశీ.. రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు

ఇక తొలిసారిగా ఎప్ సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ రూట్ మ్యాప్ తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇక ఎగ్జామ్‌కు ఒక నిమిషం నిబంధన అమల్లో ఉంది. ఒక్క నిమిషం ఆలస్యం అయిన ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు. మార్నింగ్ సెషన్ ఎగ్జామ్‌కు ఉదయం 7.30 గంటలకు.. మధ్యాహ్నం సెషన్ వారికి 1.30గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. ఇక బయోమెట్రిక్ హాజరు తీసుకోనున్నారు. చేతులపై మెహందీ, టాటూ, ఇంక్ మొదలైన డిజైన్లు ఉండకూడదని సూచించారు. ఫొటో ఐడీ, హాల్ టికెట్, బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Pak Minister Asif: భారత్ ఎప్పుడైనా మాపై దాడి చేయవచ్చు.. పాక్ సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version