Site icon NTV Telugu

Duvvada, Madhuri : అందుకే పార్టీకి వెళ్లాం.. ఫామ్‌హౌస్‌ పార్టీ వ్యవహారంపై దువ్వాడ, మాధురి క్లారిటీ

Duvvada

Duvvada

Duvvada, Madhuri : హాట్‌ టాపిక్‌ గా మారిన ఫామ్‌హౌస్ పార్టీ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి స్పందించారు. ఎన్టీవీతో వారు మాట్లాడుతూ.. పార్థు అనే స్నేహితుడి పార్టీకి పిలిస్తే వెళ్లామని, అక్కడ బిజినెస్‌ ఎక్స్‌పన్షాన్‌ గురించి మాత్రమే పార్టీ జరిగిందని వివరించారు. పార్టీలో లిక్కర్‌ ఉన్న మాట వాస్తవేమనని, కానీ.. పార్టీ నిర్వహించేందుకు లైసెన్స్‌ తీసుకోలేదని విషయం పోలీసులు వచ్చాక తెలిసిందని దువ్వాడ శ్రీనివాస్‌ వెల్లడించారు. పార్టీకి లైసెన్స్‌ లేదని తెలియడంతో అక్కడినుంచి వచ్చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే తాను పార్టీ మద్యం సేవించలేదని.. అది కేవలం బిజినెస్‌ పార్టీ మాత్రమేనని ఆయన వివరించారు. అయితే దివ్వెల మాధురి బర్త్‌ డే సందర్భంగా పార్టీ నిర్వహించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. మాధురి బర్త్‌డే ఈరోజు అని, పార్టీ జరిగిందిన నిన్న (11వ తేదీన) అని ఆయన తెలిపారు. ఒకవేళ బర్త్‌ డే పార్టీ నిర్వహించాలనుకుంటే దాని ప్రొసీజర్‌ తెలుసు అని.. గతంలో కూడా మాధురి కూతురు ఫంక్షన్‌ నిర్వహించనప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే చేశామన్నారు.

Union Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..

బర్త్‌డే కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్‌ అనే దానిపై మాట్లాడుతూ.. పుట్టినరోజు గురించి ప్రచారం చేసుకోవాలనుకుంటే.. తమకు చాలా మంది ఫాలోవర్స్‌ ఉన్నారని సోషల్‌ మీడియాలో మరో విధంగా ప్రచారం చేసుకుంటాం కానీ.. ఇలాంటి నెగిటీవ్‌ పబ్లిసిటీ చేసుకోమని వారు క్లారిటీ ఇచ్చారు. ఇక హైదరాబాద్‌లోనే స్థిరపడడంపై మాట్లాడుతూ.. తెలంగాణలో బట్టల వ్యాపారం చాలా బాగాసాగుతోందని, త్వరలోనే గోల్డ్ బిజినెస్‌ కూడా ఇందులోకే తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు దువ్వాడ శ్రీనివాస్‌. ఏపీలో రాజకీయంగా బాగానే ఉందన.. వారంలో మూడునాలుగు రోజులు టెక్కలి నియోజకవర్గంలోనే ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి సానుభూతి వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు మాధురి బర్త్‌ డే సందర్భంగా ఈవినింగ్‌ డిన్నర్ ప్లాన్‌ చేశామని.. అంతేకానీ పబ్లిసిటీ కోసం ఫామ్‌హౌస్‌ పార్టీలు చేసి నానాహంగామా చేసుకోమని మరోసారి స్పష్టం చేశారు.

Exit mobile version