NTV Telugu Site icon

Ayodhya: అయోధ్య శ్రీ రామయ్యకు దుబ్బాక చేనేత వస్త్రం..

Ayodhya

Ayodhya

Children Sales: సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతి దేశ వ్యాప్తంగా మార్మోగింది. దుబ్బాక చేనేత కార్మికులు కొత్త వస్త్ర డిజైన్లను తయారు చేయడంలో ప్రశంసలు లభిస్తున్నాయి. దుబ్బాక చేనేత వస్త్రాన్ని ధరించి కీర్తిని మరింతగా వ్యాపింపజేసిన అయోధ్య శ్రీరామచంద్రుడు. వారం రోజుల పాటు ప్రతిరోజు రాముడికి రంగుల వస్త్రంతో అలంకరించాలని ఆర్డర్ వచ్చింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బోడ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాకలో స్థాపించిన దుబ్బాక హ్యాండ్లూమ్స్ కంపెనీ తయారు చేసిన లినెన్ ఇక్కత్ చేనేత వస్త్రాన్ని (పింక్ కలర్) ఆదివారం అయోధ్య రాముడికి అలంకరించారు.

Read also: Telangana State Symbol: జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల..

తాము తయారు చేస్తున్న నార వస్త్రాలు అయోధ్య రాముడి అలంకరణకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సోమవారం నుండి ఆదివారం వరకు ఢిల్లీకి చెందిన డిజైనర్ మనీష్ట్రీపతి రామ్‌ను అలంకరించేందుకు వివిధ రంగులతో తయారు చేసిన దుస్తులను ఎంచుకుంటారని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం, రెండు రంగులతో కూడిన నార ఇకత్ వస్రాస్ యొక్క రెండు డిజైన్‌లు అందించబడ్డాయి. ఒక్కో వస్త్రం 12 మీటర్ల పొడవు ఉంటుందని తెలిపారు.
Hyderabad: మండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైన కుటుంబం.. 8 మందికి అస్వస్థత..

Show comments