NTV Telugu Site icon

Drunkers Hit SI: మందుబాబుల దూకుడు.. నేరుగా ఎస్సైని ఢీకొట్టి కాలు విరగ్గొట్టారు

Drunkards Hit Si With Bike

Drunkards Hit Si With Bike

Drunkers Hit SI: ఫుల్‌ గా మందు కొట్టారు. ఇక ఇంటికి వెళ్లాలంటే బైక్‌పై ప్రయాణం చేయాలి. తూగుతూనే బైక్‌ ఎక్కారు. ఇంతలోనే షాక్‌. వారు మందు తాగారని కనిపెట్టిన నారాయణ గూడ ఎస్సై వారి బైక్‌ ను ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో మందుబాబులు భయంతో ఇంకా స్పీడ్‌ పెంచారు. ఎస్సైని ఢీకొట్టి అక్కడనుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు కటకటాలపాలయ్యారు. బైక్‌ ఆపి వున్న ఫైన్‌ సరిపోయేదేమో కానీ.. ఏకంగా ఎస్సైని ఢీకొట్టడంతో కటకటల వెనుక ఊసలు లెక్కపెట్టారు. ఈఘటన భాగ్యనగరంలోని హిమాయత్‌ వైజంక్షన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

read also: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

హిమాయత్ వై జంక్షన్ లో నారాయణ గూడ ఎస్సై శుక్రవారం రాత్రి వాహనాల తనికీ చేపట్టారు. ఓ బైక్ ను ఆపేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు ఎస్సై ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఎస్సైకి కుడికాలు విరిగి, మెడ వద్ద ఫ్యాక్చర్‌ అయ్యింది. లా అండ్ ఆర్డర్ ఎసై నరేష్ ప్రస్తుతం నాంపల్లి కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. తాగి బైక్ నడుపుతూ ఎసై నరేష్ ను ఢీకొట్టిన రాంనాగర్ కు చెందిన చంద్రశేఖర్ , న్యూ నల్లకుంటా కు చెందిన యశ్వంత్ లను అరెస్ట్ చేసిన నారాయణగూడ పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Bride commits suicide: నవ వధువు ఆత్మహత్య.. వరుడు పై తండ్రి ఫిర్యాదు

Show comments