Bride commits suicide: నవ వధువు ఆత్మహత్య.. వరుడిపై తండ్రి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bride commits suicide in Nizamabad: పెళ్లి మండపంలో సందడి. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మరి కాసేపట్లో పెళ్లి మండపానికి రావడానికి నవ వధువు ముస్తాబవుతోంది. ఇంతలోనే విషాధ ఘటన దిగ్భాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో చోటు చేసుకుంది. మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు వధువు రవళికి మ్యారేజ్ జరగనుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ వున్న వధువు ఇంట్లోకి వెళ్లిన వధువు రవళి పెళ్లికి ముస్తాబై ఇంట్లోనే సూసైడ్ చేసుకుంది. పెళ్లికి సమయం అవుతుందని కుటుంబ సభ్యులు డోర్ లాక్ చేయడంతో ఎంత సేపటికి రవళి తలుపులు తీయలేదు. దీంతో భయభ్రాంతులైన కుటుంసభ్యులు డోర్ ను బద్దలు కొట్టి గది తలుపులు తీయగానే రవళి ఫ్యాన్ కు వేళాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో.. కుటుంబ సభ్యులు దిగ్భాంతికి గురయ్యారు. రవళి చనిపోయే కొద్దిసేపటి ముందు వరుడు, వధువుతో పాటు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కూడా డ్యాన్స్‌లు చేశారు. అప్పటి వరకు తమ కళ్లముందే వున్న వధువు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లింట విషాదం నింపింది.
Read also: CJI: మైనర్ల సమ్మతితో లైంగిక చర్యకు పాల్పడినా.. అది నేరమే..
Also Read
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
అయితే.. నవ వధువు ఆత్మహత్య ఘటనలో వరుడు పై కేసు నమోదు చేశారు పోలీసులు. వధువు ఆత్మహత్య చేసుకునే ముందే వరుడితో ఓసాంగ్ కి స్టెప్పులు కూడా వేశారు. అయితే నవ వధువు రవళి ఆత్మహత్యకు ముందు చివరి సారిగా వరుడితో ఫోన్ కాల్ మాట్లాడినట్లు తండ్రి పేర్కొన్నారు. వరుడు వేధింపులే ఆత్మహత్య కు కారణమని రవళి తండ్రి ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు 306 కేసు నమోదు చేశారు నవిపేట పోలీసులు. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నం కాగా.. పెళ్లి కూతురుగా ముస్తాబై వధువు రవళి ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. గ్రామంలో నిశ్శబ్దం అలుముకుంది. కన్నెరికం చేసి అత్తగారింటికి పంపాల్సిన కూతురికి కాటకాలతో రవళి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ కుమార్తె మృతికి కారణమైన వివాహితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
BREAKING: ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు అస్వస్థత
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!